breaking news
in zp high school
-
క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
తాడేపల్లిగూడెం రూరల్ : రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో నియోజకవర్గ స్థాయి ఖేలో ఇండియా ఆటల పోటీలను మంత్రి మాణిక్యాలరావు, మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి పెంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. ఎన్ఎస్ఎస్ జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో విద్యార్థులు ప్రతిభకనబర్చడం గర్వకారణమన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ నిమ్మగడ్డ బాలాజీ, ఏఎంసీ చైర్మన్‌పాతూరి రామ్‌ప్రసాద్ చౌదరి, ఎంపీపీ గన్నమని దొరబాబు, ఎంపీడీఓ వై.దోసిరెడ్డి, మున్సిపల్ వైస్‌చైర్మన్ కిలాడి ప్రసాద్, మండల యువమోర్ఛా అధ్యక్షుడు వి.నవీన్‌కుమార్ పాల్గొన్నారు. -
మార్టేరులో రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు
మార్టేరు(పెనుమంట్ర) : గ్రామంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయి ఇన్విటేషన్ బాస్కెట్ బాల్ పోటీలు జరగనున్నాయి. గ్రామానికి చెందిన దివంగత ఫిజికల్ డైరెక్టర్ పడాల ప్రహ్లాదరెడ్డి మెమోరియల్ పేరిట ఈ పోటీలు నిర్వహించనున్నారు. స్థానిక వేణుగోపాలస్వామి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో బాస్కెట్ బాల్ కోర్టు సిద్ధం చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు పోటీలను పారిశ్రామిక వేత్త గొలుగూరి శ్రీరామారెడ్డి ప్రారంభిస్తారని, విశిష్ట అతి«థిగా వైఎస్సార్ సీపీ ఆచంట నియోజకవర్గ సమన్వయ కర్త కవురు శ్రీనివాసు హాజరవుతారని చెప్పారు.