276 హెక్టార్లలో ఎండిన కొర్రపంట | foxtail millet crop dry in 276 hectors | Sakshi
Sakshi News home page

276 హెక్టార్లలో ఎండిన కొర్రపంట

Sep 10 2016 12:05 AM | Updated on Oct 1 2018 2:44 PM

276 హెక్టార్లలో ఎండిన కొర్రపంట - Sakshi

276 హెక్టార్లలో ఎండిన కొర్రపంట

మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన 276 హెక్టార్ల కొర్ర పంట వర్షాభావం కారణంగా పూర్తిగా ఎండిపోయిందని ఏడీఏ నారాయణస్వామినాయక్‌ తెలిపారు.

తెర్నెకల్‌(దేవనకొండ) : మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో ఈ ఏడాది ఖరీఫ్‌లో సాగుచేసిన 276 హెక్టార్ల కొర్ర పంట వర్షాభావం కారణంగా పూర్తిగా ఎండిపోయిందని ఏడీఏ నారాయణస్వామినాయక్‌ తెలిపారు. శుక్రవారం ఆయన  తెర్నెకల్‌లో సాగైన కొర్ర పంటను పరిశీలించారు. సకాలంలో వర్షాలు కురిసి ఉంటే పంట బాగుండేదన్నారు. కొర్ర పంట వల్ల రైతులు కాస్త నష్టపోయాన్నారు. నష్టపోయిన పంటల వివరాలను సేకరించి జిల్లా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట ఏఓ అల్తాఫ్‌ఆలీఖాన్, ఎంపీఈఓ తిమ్మప్ప, సర్పంచు రాజన్న ఉన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement