మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు.
అక్రమ ఆయుధాలు పట్టివేత : నలుగురి అరెస్ట్
Aug 9 2016 11:22 AM | Updated on Oct 16 2018 3:12 PM
సంగారెడ్డి : మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం ఫసల్‌వాదిలో పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 2 తుపాకులు, 2 కత్తులు, 3 బుల్లెట్లు లభ్యమయ్యాయి. వీటిని తరలిస్తోన్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సంపన్నులను బెదిరించి తేలికగా డబ్బుగా సంపాదించాలనే ప్రయత్నంలో భాగంగా వారు ఇక్కడ వచ్చినట్లు విచారణలో తేలింది. అరెస్టైన వారిలో ఒకరు స్థానికుడు కాగా.. మిగతా ముగ్గురు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారని సంగారెడ్డి డీఎస్పీ తిరుపతన్నతెలిపారు.
Advertisement
Advertisement