‘నవోదయ’లో చదవడం అదృష్టం | fortunate to read in navodaya | Sakshi
Sakshi News home page

‘నవోదయ’లో చదవడం అదృష్టం

Jul 16 2017 10:34 PM | Updated on Sep 5 2017 4:10 PM

‘నవోదయ’లో చదవడం అదృష్టం

‘నవోదయ’లో చదవడం అదృష్టం

లేపాక్షి నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు, సివిల్స్‌కు ఎంపికై ఉద్యోగులు తెలిపారు.

లేపాక్షి : లేపాక్షి నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడం అదృష్టంగా భావిస్తున్నట్లు పూర్వ విద్యార్థులు, సివిల్స్‌కు ఎంపికైన ఉద్యోగులు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం లేపాక్షి నవోదయ విద్యాలయంలో అల్యూమినీ అసోసియేషిన్‌ అధ్యక్షుడు, పూర్వ విద్యార్థులు డాక్టర్‌ వెంకటరమణ అధ్యక్షతన పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి ఉపాధ్యాయుల కృషి వల్లే ఈ స్థాయికి ఎదిగామన్నారు.

అనంతరం పూర్వ విద్యార్థులంతా అలనాటి తీపిగుర్తులతో అనందంతో గడిపారు. ఈ సందర్భంగా బెంగుళూర్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న లాబూరాం, సోలాపూర్‌లో ఐఆర్‌పీఎస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న చంద్రమోహీయార్, అలహాబాద్‌లో కంట్రోల్‌మెంట్‌ బోర్డు నిర్వహణ అధికారిగా దినేష్‌ కుమార్‌ రెడ్డి, ఇటీవల సివిల్స్‌కు ఎంపికైన జగదీశ్వర్‌రెడ్డిని సన్మానించారు.  కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ భాస్కర్‌కుమార్, ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement