నీటమునిగిన గోదావరి వంతెన | floods at adilabad district | Sakshi
Sakshi News home page

నీటమునిగిన గోదావరి వంతెన

Jul 25 2016 11:12 AM | Updated on Sep 4 2017 6:14 AM

ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గూడెం వంతెన పూర్తిగా వరద నీటితో మునిగి పోయింది.

దండేపల్లి : ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గూడెం వంతెన పూర్తిగా వరద నీటితో మునిగి పోయింది. దండేపల్లి మండలం గూడెం వద్ద గోదావరి నదిపై గల లోలెవల్ వంతెన ఆదివారం రాత్రి మునిగిపోయింది. సోమవారం ఉదయానికి కూడా నీటి ప్రవాహం తగ్గకపోవడంతో రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పక్కనే ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న కొంత వంతెన మీదుగా చిన్న వాహనాలకు అధికారులు అనుమతిస్తున్నారు. వంతెనపై వరద ప్రవాహం తగ్గూవరకు రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement