రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు | five members injured in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు

Aug 17 2016 12:56 AM | Updated on Aug 30 2018 4:07 PM

కట్టంగూర్‌: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన సంఘటన మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది.

కట్టంగూర్‌: రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలైన సంఘటన మండలంలోని అయిటిపాముల గ్రామశివారులో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నకిరేకల్‌కు చెందిన వీరవెళ్లి రఘనాథ్‌ తన కుటుంబసభ్యులతో కలిసి  పుష్కరాలకు కారులో దర్వేశిపురం వెళ్లారు.  పుష్కరస్నానాలు అనంతరం స్వగ్రామం బయలుదేరారు. మండలంలోని అయిటిపాముల శివారులోని సబ్‌స్టేషన్‌ సమీపంలోకి రాగానే కారు ముందు టైరు పగిలిపోవటంతో అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. అదే సమయంలో కారులోని బెలూన్స్‌ ఓపెన్‌ కావటంతో అందులో ఉన్న రఘనాథ్, శ్రీధర్, రజితతో పాటు ఇద్దరు చిన్నారులకు స్వల్పగాయాలయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement