సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం | Fishermen caught at sea were unharmed | Sakshi
Sakshi News home page

సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు క్షేమం

Dec 13 2016 11:09 AM | Updated on Sep 4 2017 10:38 PM

సముద్రంలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం క్షేమంగా ఒడ్డుచేరారు

నర్సాపురం(పశ్చిమగోదావరి జిల్లా): పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం చినమైనవానిలంక వద్ద సముద్రంలో చిక్కుకున్న ఐదుగురు మత్స్యకారులు మంగళవారం ఉదయం క్షేమంగా ఒడ్డుచేరారు. మెరైన్ సిబ్బంది వారిని అంతర్వేది వద్ద ఒడ్డుకు చేర్చారు. గత సాయంత్రం చేపలవేటకు వెళ్లిన వారు వార్దాతుపాను కారణంగా సముద్రంలో చిక్కుబడిపోయారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు స్పందించిన మెరైన్ సిబ్బంది వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. విషయాన్ని వారి కుటుంబసభ్యులకు తెలియజేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement