వైటీసీ భవనమే కలెక్టరేట్‌గా ఖరారు | Sakshi
Sakshi News home page

వైటీసీ భవనమే కలెక్టరేట్‌గా ఖరారు

Published Sat, Aug 27 2016 11:20 PM

వైటీసీ భవనమే కలెక్టరేట్‌గా ఖరారు - Sakshi

  • డైనింగ్‌ హాల్‌లో కాన్ఫరెన్స్‌ హాల్‌
  • పక్కా భవనాల కోసం 25 ఎకరాల స్థలాన్ని గుర్తించాం 
  • ఏడాదిన్నరలోపే నిర్మాణాలు పూర్తి 
  • మానుకోట ఆర్డీఓ భాస్కర్‌రావు
మహబూబాబాద్‌ : గిరిజన యువజన శిక్షణ కేం ద్రం కలెక్టర్‌ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం దాదాపు ఖరారైంది. ఈ మే రకు శనివారం ఆర్డీఓ జి.భాస్కర్‌రావు వివరాలు వెల్లడించారు. కలెక్టర్‌ కరుణ ఆదేశాల మేరకు పట్టణ శివారులోని ఇందిరా కాలనీ సమీపంలో ని వైటీసీ భవనాన్ని ఆర్డీఓతోపాటు అధికారులు  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గండికోట భాస్కర్‌రావు మాట్లాడుతూ కలెక్టరేట్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా కార్యాలయాల విషయంలోను భవనాలను పరిశీలించి నివేదిక అందజే సినట్లు తెలిపారు. వైటీసీ భవనంలోని గదులు పరిశీలించామని, ఫర్నిచర్, ఇతరాత్ర సౌకర్యాల కోసం సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. వైటీసీ భవనంలోని డైనింగ్‌ హాల్‌ను కాన్ఫరెన్స్‌ హాల్‌గా కేటాయించనున్నట్లు తెలి పాఉ. ఐటీఐ కళాశాల భవనాన్ని పోలీస్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంగా, ఎంపీడీఓ కార్యాలయాన్ని సీఓగా కార్యాలయంగా, ఇతరాత్ర భవనాలను కూడా పరిశీలించి సంబంధిత శాఖల కార్యాలయాల కోసం కేటాయించినట్లు తెలిపారు. కలెక్టరేట్‌లోనూ ఇతరత్ర విభాగాల కోసం భవనాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వైటీసీ భవనం దగ్గరలోనే రెండు ప్రభుత్వ భవనాలు ఉన్నాయని వాటిని కూడా కార్యాల యాలకు ఉపయోగించుకునేందుకు పరిశీలించామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, తహసీల్దార్‌ కె.విజయ్‌కుమార్, డీటీ శ్రీకాంత్, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్‌ఎం పొడుగు నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 
 
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు.. 
ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసు లు తప్పవని ఆర్డీఓ జి.భాస్కర్‌రావు హెచ్చరిం చారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ భూములను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేయాలన్నారు. భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని ఎలాంటి సమస్యలు లేని భూములను కొనుగోలు చేయడం మంచిదన్నారు.

 

Advertisement
Advertisement