breaking news
YTC (Tribal Youth Training Centre)
-
యువతకు ‘వైటీసీ’ వెలుగులు!
సాక్షి, హైదరాబాద్: అడవి బిడ్డల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోని యువకులు మహానగరంలో కొలువులతో వికసిస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖ సరికొత్త ప్రణాళికతో ఏజెన్సీ యువత జీవితంలో కొత్త రూపు సంతరించుకుంటోంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు గిరిజన సంక్షేమ శాఖ యువజన శిక్షణ కేంద్రాల (వైటీసీ)ను ఏర్పాటు చేసింది. ఏటూరునాగారం, భద్రాచలం, ఉట్నూరు ఐటీడీఏల పరిధిలో 14 యూత్ ట్రైనింగ్ కేంద్రాలను గత డిసెంబర్లో తెరిచింది. ఒక్కో వైటీసీని 27 వేల చదరపు అడుగులతో ఉన్న పక్కా భవనాల్లో ఏర్పాటు చేసింది. ఉపాధి లక్ష్యంగా శిక్షణ ప్రారంభించింది. శిక్షణ ఇచ్చేందుకు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందడంతోపాటు అత్యుత్తమ రేటింగ్ ఉన్న సంస్థలను ఎంపిక చేసింది. వైటీసీల నిర్వహణ, శిక్షణకు సంబంధించి నిధులు జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ నుంచే అందుతున్నాయి. ఈ నేపథ్యంలో పర్యవేక్షణ బాధ్యతల్ని గిరిజన సంక్షేమ శాఖ పక్కాగా నిర్వహిస్తోంది. ఫలించిన ప్రయోగం యువజన శిక్షణ కేంద్రాల్లో స్వయం ఉపాధి కోర్సులతోపాటు కెరీర్ గైడెన్స్, కంప్యూటర్ ఫండమెంటల్స్, మొబైల్ రిపేరింగ్, ఎలక్ట్రీషియన్, బ్యూటీషియన్, సాఫ్ట్ స్కిల్స్, డ్రైవింగ్, సెక్యూరిటీ గార్డ్స్, ఫుడ్, బేవరేజెస్ తదితర రంగాల్లో శిక్షణ ఇస్తోంది. ఈ క్రమంలో 3,066 మంది వివిధ కోర్సుల్లో శిక్షణ తీసుకున్నారు. ఇందులో ఇప్పటికే 1,073 మంది ఉద్యోగాలు పొందారు. మరో 1,029 మంది శిక్షణ పొందుతున్నారు. ఈ కేంద్రాల ద్వారా మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు గిరిజన సంక్షేమ శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. విద్యార్హతలు, మార్కెట్లో డిమాండ్‌ను బట్టి చర్యలు తీసుకోనుంది. త్వరలో మరిన్ని కేంద్రాలు వైటీసీలతో ఏజెన్సీ ప్రాంతాల్లోని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. మంచి ఫలితాలు వస్తుండటంతో మరిన్ని కేంద్రాలు తెరిచేలా ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతానికి ఆరు చోట్ల కొత్తగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం పక్కా భవనాలు నిర్మిస్తున్నాం. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ గుర్తింపు పొందిన సంస్థల ద్వారానే వైటీసీలను నిర్వహిస్తున్నాం. – ఎం.లక్ష్మిప్రసాద్, స్టేట్ మిషన్ మేనేజర్, ట్రైకార్ కుటుంబానికి ఆసరాగా నిలిచా.. నా చిన్నప్పుడే నాన్న చనిపోయారు. అమ్మ రోజూ కూలి పని చేస్తూ నన్ను, తమ్ముడ్ని పోషించింది. ఇంటర్ వరకు చదివి.. ఆర్థిక కారణాలతో పై చదువులకు వెళ్లలేకపోయా. వరంగల్‌లోని వైటీసీలో శిక్షణ తీసుకుంటే ఉద్యోగం వస్తుందని తెలియడంతో చేరా. ఫుడ్ అండ్ బేవరేజెస్ కోర్సులో శిక్షణ తీసుకున్నా. జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్లో ఉద్యోగం దక్కింది. కుటుంబానికి ఆసరాగా నిలిచా. దీనికి కారణమైన గిరిజన సంక్షేమ శాఖకు కృతజ్ఞతలు. – భూక్యా శిరీష, కేసముద్రం, మహబూబాబాద్ జిల్లా -
వైటీసీ భవనమే కలెక్టరేట్‌గా ఖరారు
డైనింగ్ హాల్లో కాన్ఫరెన్స్ హాల్ పక్కా భవనాల కోసం 25 ఎకరాల స్థలాన్ని గుర్తించాం ఏడాదిన్నరలోపే నిర్మాణాలు పూర్తి మానుకోట ఆర్డీఓ భాస్కర్‌రావు మహబూబాబాద్ : గిరిజన యువజన శిక్షణ కేం ద్రం కలెక్టర్ కార్యాలయంగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయం దాదాపు ఖరారైంది. ఈ మే రకు శనివారం ఆర్డీఓ జి.భాస్కర్‌రావు వివరాలు వెల్లడించారు. కలెక్టర్ కరుణ ఆదేశాల మేరకు పట్టణ శివారులోని ఇందిరా కాలనీ సమీపంలో ని వైటీసీ భవనాన్ని ఆర్డీఓతోపాటు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ గండికోట భాస్కర్‌రావు మాట్లాడుతూ కలెక్టరేట్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలపైనే ప్రత్యేక దృష్టి పెట్టి మిగతా కార్యాలయాల విషయంలోను భవనాలను పరిశీలించి నివేదిక అందజే సినట్లు తెలిపారు. వైటీసీ భవనంలోని గదులు పరిశీలించామని, ఫర్నిచర్, ఇతరాత్ర సౌకర్యాల కోసం సంబంధిత అధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. వైటీసీ భవనంలోని డైనింగ్ హాల్‌ను కాన్ఫరెన్స్ హాల్‌గా కేటాయించనున్నట్లు తెలి పాఉ. ఐటీఐ కళాశాల భవనాన్ని పోలీస్ సూపరింటెండెంట్ కార్యాలయంగా, ఎంపీడీఓ కార్యాలయాన్ని సీఓగా కార్యాలయంగా, ఇతరాత్ర భవనాలను కూడా పరిశీలించి సంబంధిత శాఖల కార్యాలయాల కోసం కేటాయించినట్లు తెలిపారు. కలెక్టరేట్లోనూ ఇతరత్ర విభాగాల కోసం భవనాలను పరిశీలించినట్లు వెల్లడించారు. వైటీసీ భవనం దగ్గరలోనే రెండు ప్రభుత్వ భవనాలు ఉన్నాయని వాటిని కూడా కార్యాల యాలకు ఉపయోగించుకునేందుకు పరిశీలించామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, తహసీల్దార్ కె.విజయ్‌కుమార్, డీటీ శ్రీకాంత్, ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పొడుగు నర్సయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే క్రిమినల్ కేసు లు తప్పవని ఆర్డీఓ జి.భాస్కర్‌రావు హెచ్చరిం చారు. ఆర్డీఓ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడుతూ భూములను కొనుగోలు చేసే ముందు తప్పనిసరిగా పూర్తి వివరాలు తెలుసుకొని కొనుగోలు చేయాలన్నారు. భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ అధికారుల ద్వారా సమాచారం తెలుసుకొని ఎలాంటి సమస్యలు లేని భూములను కొనుగోలు చేయడం మంచిదన్నారు.