
హెచ్‌ఐవీ సోకుతుందనే భయంతోనే..
హెచ్‌ఐవీ పాజిటివ్ రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్‌ఐవీ సోకుందనే భయంతోనే డాక్టర్ రాచమళ్ల విజయలక్ష్మి(24) ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో మూడు వారాల క్రితం హెచ్‌ఐవీ సోకిన రోగికి ఆపరేషన్ చేస్తున్న సమయంలో సూది గుచ్చుకోవటంతో తనకు కూడా హెచ్‌ఐవీ సోకుతుందనే భయంతో విజయలక్ష్మి మానసిక ఒత్తిడికి గురైనట్లు తోటి వైద్యులు తెలిపారు. తక్షణమే హెచ్‌ఐవీ నిరోధక మందులు వాడటం ప్రారంభించినా రెండు రోజులుగా విరోచనాలు అవుతుండటంతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు.