మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష | Fast unto death in support of the victims of mallannasagar | Sakshi
Sakshi News home page

మల్లన్నసాగర్ బాధితులకు మద్దతుగా ఆమరణదీక్ష

Aug 8 2016 7:16 PM | Updated on Sep 4 2017 8:25 AM

మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 10 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు.

-10 నుంచి సంగారెడ్డిలో నిరశన
-అవసరమైతే సుప్రీం కోర్టుకు
-కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి వెల్లడి

సంగారెడ్డి

 మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 10 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

 

అవసరమైతే పార్టీ పక్షాన సుప్రీం కోర్టును ఆశ్రరుుస్తామన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకొచ్చేందుకు సంగారెడ్డిలోని ఐబీ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు. హైకోర్టు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టినా సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండటాన్ని చూస్తే న్యాయవ్యవస్థపై కూడా విశ్వాసం లేకుండా పరిపాలన సాగిస్తోందన్నారు. తాము రైతులకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. దీక్ష కోసం ఇప్పటికే తమకు అనుమతి ఇవ్వాలని పోలీసుశాఖను కోరామన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోన్నం శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement