అప్పుల బాధతాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు.
రైతు ఆత్మహత్య
Jul 26 2016 12:39 AM | Updated on Nov 6 2018 8:28 PM
వెల్దుర్తి రూరల్:
అప్పుల బాధతాళలేక ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అతను చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పుల్లగుమ్మి గ్రామానికి చెందిన సుంకన్న (38), లక్ష్మీదేవి దంపతులకు ఐదుగురు కుమార్తెలు కాగా రెండు నెలల క్రితం కుమారుడు పుట్టాడు. సుంకన్న రెండేళ్ల క్రితం వరకు హమాలీ పని చేసి మానేశాడు. స్వగ్రామానికి చేరుకుని తన సొంత రెండున్నరెకరాల పొలంలో పంటలు సాగు చేశాడు. గత ఏడాది మిరప, ఉల్లి సాగు చేసి తీవ్రంగా నష్టపోయాడు. దాదాపు రూ. 3 లక్షలు అప్పు మిగిలింది. ఈ ఏడాది మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని కంది వేశాడు. ఇటీవల తన సొంత పొలంలో ఉల్లి సాగు చేసేందుకు అప్పు ఎవరూ ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈనెల 21వ తేదీన వెల్దుర్తి చేరుకున్న అతను మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు గుర్తించి 108లో కర్నూలుకు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఇంటి పెద్ద మతి చెందడంతో భార్య, కుమార్తెలు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement