నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు | eye donate and two uses | Sakshi
Sakshi News home page

నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు

May 9 2017 11:21 PM | Updated on Sep 5 2017 10:46 AM

మరణానంతరం నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించారు పట్టణానికి చెందిన నారాయణమూర్తి (50). స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు.

ధర్మవరం టౌన్ : మరణానంతరం నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించారు పట్టణానికి చెందిన నారాయణమూర్తి (50). స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆయన ఎల్‌ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఆయన అనారోగ్యంతో  మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులు నేత్రదానం ఆవశ్యకతను అతడి కుటుంబసభ్యులకు వివరించారు. వారు అంగీకరించడంతో డాక్టర్‌ బీవీ సుబ్బారావు ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించి నేత్రాలను భద్రపరచి అనంతపురంలోని బాలాజీ ఐకేర్‌ ట్రస్ట్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్‌ సభ్యులు మాట్లాడుతూ నేత్రదానం కోసం 99851 46362, 94406 83100 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ అధ్యక్షుడు వైకే శ్రీనివాసులు, సభ్యులు బీఆర్‌ రంగనాథ్, పోలా ప్రభాకర్, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement