ఉత్సాహంగా క్రీడా పోటీలు | Exciting sports competitions | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా క్రీడా పోటీలు

Aug 27 2016 6:48 PM | Updated on Sep 4 2017 11:10 AM

ఉత్సాహంగా క్రీడా పోటీలు

ఉత్సాహంగా క్రీడా పోటీలు

క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం కడప నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్‌ స్టేడియంలో ఈ పోటీలను డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ ప్రారంభించి మాట్లాడారు.

కడప స్పోర్ట్స్‌:
క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడాపోటీలు నిర్వహించారు. శనివారం కడప నగరంలోని డీఎస్‌ఏ అవుట్‌డోర్‌ స్టేడియంలో ఈ పోటీలను డీఎస్‌డీఓ లక్ష్మినారాయణశర్మ ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 29న మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా నిర్వహించనున్న క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని మూడురోజుల పాటు వివిధ క్రీడాపోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. «శాప్‌ డైరెక్టర్‌ జయచంద్ర మాట్లాడుతూ క్రీడాకారులు ధ్యాన్‌చంద్‌ చూపిన పోరాటపటిమను ఆదర్శంగా తీసుకుని రాణించాలని సూచించారు.అనంతరం పరుగుపందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వల్లూరు కేజీబీవీ వ్యాయామ ఉపాధ్యాయురాలు సునీత, కోచ్‌ గౌస్‌బాషా, నూర్, సిబ్బంది సూర్యనారాయణరాజు, రామకృష్ణారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
 
 
 

Advertisement
 
Advertisement
Advertisement