జాతీయ సమైక్యత అందరి బాధ్యత | every one response for national unity | Sakshi
Sakshi News home page

జాతీయ సమైక్యత అందరి బాధ్యత

Mar 18 2017 10:04 PM | Updated on Sep 5 2017 6:26 AM

జాతీయ సమైక్యత అందరి బాధ్యత

జాతీయ సమైక్యత అందరి బాధ్యత

కుల,మత, వర్గాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని, అందకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇలియాస్‌ అన్నారు.

- ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం
   జిల్లా అధ్యక్షుడు మహ్మద్‌ ఇలియాస్‌
- 26న జాతీయ సర్వమత సమ్మేళనం
 
కర్నూలు సీక్యాంప్‌:  కుల,మత, వర్గాలతో సంబంధం లేకుండా దేశ ప్రజలందరూ శాంతియుతంగా జీవించాలని, అందకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల సంఘం జిల్లా అధ్యక్షుడు మహమ్మద్‌ ఇలియాస్‌ అన్నారు. ఈ నెల 26న కర్నూలు చౌక్‌బజార్‌లో నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనం కార్యక్రమ పోస్టర్‌ను శనివారం కృష్ణానగర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇలియాస్‌ మాట్లాడుతూ దేశ ప్రజల్లో అనైక్యత వల్లా అశాంతి పెరిగిపోతోందన్నారు. ఈ అశాంతిని తగ్గించడమే లక్ష్యంగా తగ్గించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న జాతీయ సర్వమత సమ్మేళనానికి మంత్రాలయం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు, పాస్టర్‌ ప్రభుదాస్, హజ్రత్‌ మౌలానా సయ్యద్‌ అష్‌హద్‌ రహీది మదని ముఖ్యాతిథులుగా హాజరై ప్రసంగిస్తారన్నారు. డీఐజీ రమణకుమార్, జిల్లా ఎస్పీ ఆకెరవికృష్ణ కూడా హాజరవుతారని తెలిపారు. పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ మౌలానా అబ్దుల్‌ ఖదీర్‌, ట్రెజరర్‌ మహ్మద్‌ గౌస్, సభ్యులు జిలాన్‌బాషా, అబ్దుల్‌వాజీద్, మౌలానా శుకర్రం తదితరులు పాల్గొన్నారు. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement