మొక్కలతో పర్యావరణ పరిరక్షణ
నెల్లూరు(బృందావనం): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య పేర్కొన్నారు.
నెల్లూరు(బృందావనం): ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ నెల్లూరు రీజినల్ మేనేజర్ బీవీ శివయ్య పేర్కొన్నారు. సామాజిక సేవలో భాగంగా నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సంయుక్తంగా మనుమసిద్ధినగర్‌లో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా ప్రస్తుతం ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయని చెప్పారు. దాదాపు 200 మొక్కలు నాటారు. మూలాపేట ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ శాఖ మేనేజర్ వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్లు దువ్వూరు శరత్‌చంద్ర, పెనుబల్లి చంద్రారెడ్డి, నెల్లూరు పీపుల్స్ ఫ్రంట్ అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేష్‌ఆచారి, రియాజ్, కోశాధికారి పెంచలరాజా, సభ్యులు సమద్, హరీష్‌సింగ్, మధు, కార్తీక్, బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.