రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి | Engineering students killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థుల మృతి

May 6 2016 1:52 PM | Updated on Sep 3 2017 11:32 PM

తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు.

తూర్పు గోదావరి జిల్లా, పెద్దాపురం మండలం పరిధిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతిచెందారు. బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన అమిత్ కుమార్, ప్రవీణ్ కుమార్ గండేపల్లి మండలం సూరంపాలెంలలోని ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ పూర్తి చేశారు.


స్వస్థలాలకు వెళ్లేందుకు రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకుందామని సామర్ల కోటకు స్కూటర్ పై బయల్దేరారు. పెద్దాపురం సమీపంలోని అరవింద ప్లాస్టిక్స్ కంపెనీ వద్ద మూల మలుపులో వారి స్కూటర్ స్కిడ్ అయ్యి లారీ కిందకు దూసుకు పోవడంతో అక్కడికక్కడే మృతి చెందారు.
 

Advertisement
 
Advertisement
Advertisement