అంకితభావంతో పుష్కర విధులు నిర్వర్తించండి | duty minded | Sakshi
Sakshi News home page

అంకితభావంతో పుష్కర విధులు నిర్వర్తించండి

Jul 29 2016 11:27 PM | Updated on Aug 21 2018 7:53 PM

అంకితభావంతో పుష్కర విధులు నిర్వర్తించండి - Sakshi

అంకితభావంతో పుష్కర విధులు నిర్వర్తించండి

గోదావరి అంత్యపుష్కరాలలో అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పోలీసులకుసూచించారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహకారించాలన్నారు.

  • యాత్రికులతో మర్యాదగా వ్యవహరించండి l
  • రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఎస్పీ రాజకుమారి
  • ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం):
    గోదావరి అంత్యపుష్కరాలలో అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పోలీసులకుసూచించారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహకారించాలన్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న అంత్యపుష్కరాలను పురస్కరించుకుని అర్బన్‌జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన 2500 మంది పోలీసుసిబ్బంది, అధికారులకు శుక్రవారం సాయంత్రం  స్థానిక ఎంఆర్‌ మైదానంలో విధులను కేటాయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంత్య పుష్కరాల అనుభవంతో కృష్ణాపుష్కరాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అర్బన్‌ పరిధిలో ఏడు ప్రధాన్‌ఘాట్‌లను గుర్తించి ఒక్కో ఘాట్‌కు ఒక డీఎస్పీని, ఒక సీఐని పర్యవేక్షకులుగా నియమించామన్నారు. పోలీసు సిబ్బందితో పాటు 200 మంది ఎన్‌సీసీ, 200 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు సేవలందిస్తారన్నారు. పోలీసుగెస్ట్‌హౌస్‌ వద్ద ప్రధాన కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు పది ప్రాంతాలను గుర్తించామన్నారు. జాతీయరహదారి మీదుగా వచ్చే వాహనాలను నగరంలోకి అనుమతించబోమని తెలిపారు. టింబర్‌యార్డు, గోదావరి రైల్వేస్టేçÙన్, సంస్కృత కళాశాలలలో మోటార్‌సైకిల్‌ పార్కింగ్‌కు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉన్న సమయాల్లో స్నానఘట్టాల పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఇబ్బందులు పడకుండా గుర్తింపు కార్డులు సూచిస్తే తిరగడానికి అనుమతిస్తామన్నారు. అంత్యపుష్కరాల్లో నేరాల నిరోధానికి అనుమానితులు, యాచకులు, నిరాశ్రయులను తరలించేందుకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించామని, పాత నేరస్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చామని తెలిపారు. ఘాట్‌లు రద్దీగా ఉన్న సమయంలో యాత్రికులను ఇతర ఘాట్‌లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వ్యక్తులను వెంటనే సమీపంలోని అవుట్‌పోస్టుకు చేర్చాలని సూచించారు. అనుమానాస్పద వస్తువుల సమాచారాన్ని వెంటనే బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌ అధికారులకు తెలియజేయాలన్నారు. అంత్యపుష్కరాలలో పోలీసు సిబ్బంది పాటించాల్సిన అంశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. డీఎస్పీలు అంబికాప్రసాద్, నారాయణరావు, రామకృష్ణ, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement