సరస్వతీ దేవిగా దుర్గామాత | durgamma looks as a saraswathi devi | Sakshi
Sakshi News home page

సరస్వతీ దేవిగా దుర్గామాత

Oct 6 2016 5:03 PM | Updated on Sep 4 2017 4:25 PM

చెల్లాపూర్‌లో సరస్వతీమాతకు పూజలు

చెల్లాపూర్‌లో సరస్వతీమాతకు పూజలు

దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత గురువారం సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

దుబ్బాక: దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. దుర్గామాత గురువారం సరస్వతీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో చేస్తున్న విశేష పూజలు అమ్మవారు అందుకుంటున్నారు. దుర్గామాత సేవలో భక్తులు నిమగ్నమయ్యారు.

నగర పంచాయతీ పరిధిలోని దుంపలపల్లి హిందూ రక్ష సమితి ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గామాతకు మాజీ ఎంపీటీసీ సభ్యురాలు అధికం మల్లీశ్వరి, వెంకటస్వామిగౌడ్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వ్రతాలు చేశారు. చెల్లాపూర్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన అమ్మవారికి పీఏసీఎస్‌ చైర్మన్‌ అమ్మన రవీందర్‌రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు చేపట్టారు.

భక్తులకు అన్న ప్రసాదాలు అందించారు. వైధిక క్రతువులను ప్రముఖ పురోహితులు లక్ష్మణ శర్మ, సంగమేశ్వర్లు నిర్వహించారు. ప్రజలు పాడి పంటలు, సుఖ సంతోషాలతో తులతూగాలని, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని కోరుకున్నట్లు భక్తులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆయా యూత్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement