విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు | dont neglect duties | Sakshi
Sakshi News home page

విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

Jan 11 2017 11:35 PM | Updated on Sep 5 2017 1:01 AM

విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

విధుల పట్ల నిర్లక్ష్యం వద్దు

విధుల పట్ల నిర్లక్ష్యం వద్దని హోంగార్డ్స్‌ సదరన్‌ రేంజ్‌ కమాండెంట్‌(రాయలసీమ రేంజ్‌)చంద్రమౌళి అన్నారు.

– సదరన్‌ రేంజ్‌ కమాండెంట్‌ చంద్ర మౌళి
 
ఆదోని టౌన్‌: విధుల పట్ల నిర్లక్ష్యం వద్దని హోంగార్డ్స్‌ సదరన్‌ రేంజ్‌ కమాండెంట్‌(రాయలసీమ రేంజ్‌)చంద్రమౌళి అన్నారు. బుధవారం ఆదోనిలో హోం గార్డుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 880 మంది రెగ్యులర్, 220 మంది ఆన్‌ పెయిడ్‌హోం గార్డులు ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలను హోం గార్డులు ఉపయోగించుకోవాలన్నారు. ఈ నెల 23 నుంచి జిల్లాలో మూడు టీంలుగా విభజించి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నామన్నారు. స్త్రీలు, విద్యార్థులు, చిన్న పిల్లలు, మీడియా పట్ల ఎలా వ్యవహరించుకోవాలో శిక్షణలో వివరించనున్నామన్నారు. నంద్యాల, ఆదోని, కర్నూలు పట్టణాల్లో ట్రాఫిక్‌లో విధులు నిర్వహించే సమయంలో సమయ పాలన, స్నేహభావం కలిగి ఉండాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement