డాక్టర్‌ శిఖామణికి పురస్కారం | doctor sikhamani award | Sakshi
Sakshi News home page

డాక్టర్‌ శిఖామణికి పురస్కారం

Nov 16 2016 10:22 PM | Updated on Sep 4 2017 8:15 PM

యానాంకు చెందిన ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ శిఖామణికి గురజాడ ఫౌండేష¯ŒS (అమెరికా), ఇండియా శాఖలు సంయుక్తంగా ‘గురజాడ స్ఫూర్తిరత్న’ పుర స్కారాన్ని ప్రకటించాయి. ఈ మేరకు గురజాడ ఫౌండేష¯ŒS అనుబంధ సంస్థ (ఇండియా) అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేసినట్టు శిఖామణి బుధవారం తెలిపారు. ఈ ఏడాదికి

యానాం టౌ¯ŒS :
యానాంకు చెందిన ప్రముఖ కవి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు డాక్టర్‌ శిఖామణికి గురజాడ ఫౌండేష¯ŒS (అమెరికా), ఇండియా శాఖలు సంయుక్తంగా ‘గురజాడ స్ఫూర్తిరత్న’ పుర స్కారాన్ని ప్రకటించాయి. ఈ మేరకు గురజాడ ఫౌండేష¯ŒS అనుబంధ సంస్థ (ఇండియా) అధ్యక్షుడు ఒక ప్రకటన విడుదల చేసినట్టు శిఖామణి బుధవారం తెలిపారు. ఈ ఏడాదికి తనతో పాటు సాహిత్యరంగంలో విశేష సేవలందించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు, సుప్రసిద్ధ కవులు కె.శివారెడ్డి, డాక్టర్‌ ఆర్‌.చంద్రశేఖర్‌లను,  ప్రముఖ కవయిత్రి దామరాజు విశాలాక్షిలను పురస్కారానికి ఎంపిక చేసినట్టు తెలిపారు. జనవరి 29 న విజయనగరంలోని గురజాడ స్మారక భవనంలో జరిగే కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేస్తారన్నారు. ప్రతిష్టాత్మకమైన గురజాడ పురస్కారానికి శిఖామణి ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement