గర్భిణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా | doctor responds pregnent woman problem | Sakshi
Sakshi News home page

గర్భిణి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

Nov 15 2016 10:42 PM | Updated on Sep 4 2017 8:10 PM

'గర్భిణి కష్టాలు' అన్న శీర్షికతో మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.

అనంతపురం మెడికల్‌ : 'గర్భిణి కష్టాలు' అన్న శీర్షికతో మంగళవారం సాక్షిలో కథనం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.  వైద్య ఆరోగ్యశాఖ అధికారుల ఆదేశాలతో ఎన్‌ఎస్‌ గేట్‌ హెల్త్‌ సూపర్‌వైజర్‌ సుధారాణి ఆస్పత్రికి వచ్చి దివ్యరూపతో మాట్లాడారు. అనంతరం గైనిక్‌ ఇన్‌చార్జ్‌ హెచ్‌ఓడీ డాక్టర్‌ సంధ్య, గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ మాధవిని కలిశారు.

ఈ సందర్భంగా వారు గర్భిణికి ధైర్యం చెప్పారు. బిడ్డ బరువు తక్కువగా ఉందని, దీంతో రక్తం ఎక్కించాలని సూచించారు. ఇటీవల చేసిన వైద్య పరీక్షల నివేదికను పరిశీలించి వచ్చే నెలలో డెలివరీ కానున్నట్లు స్పష్టం చేశారు. రక్తం ఎక్కించిన తర్వాత మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్‌ చేస్తామన్నారు. ఆ తర్వాత ప్రతి వారం రావాల్సి ఉంటుందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement