
పాదయాత్రపై పైశాచికం
తీర ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌కు వ్యతిరేకంగా కోనదండు కదిలింది. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం తాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట గ్రామాలకు చెందిన వందలాదిమంది వృద్ధులు, మహిళలు, రైతులు కలిసి పంపాదిపేట నుంచి కాకినాడ కలెక్టరేట్ వరకూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పంపాదిపేట వీధుల్లో సాగిన ఈ యాత్ర శృంగవృక్షంపేట,
- సీపీఎం ఆధ్వర్యంలో బాధితుల ఆందోళన
- పంపాదిపేట నుంచి కాకినాడకు పయనం
- జనసంద్రంతో కిక్కిరిసిన బీచ్‌రోడ్డు
- తీరప్రాంత గ్రామాల మీదుగా సాగిన యాత్ర
- అడ్డుకున్న పోలీసులు.. అరెస్టులు
తొండంగి:
తీర ప్రాంతంలో కాలుష్య కారక దివీస్ ల్యాబొరేటరీస్‌కు వ్యతిరేకంగా కోనదండు కదిలింది. సీపీఎం ఆధ్వర్యంలో శనివారం తాటియాకులపాలెం, కొత్తపాకలు, పంపాదిపేట, శృంగవృక్షంపేట గ్రామాలకు చెందిన వందలాదిమంది వృద్ధులు, మహిళలు, రైతులు కలిసి పంపాదిపేట నుంచి కాకినాడ కలెక్టరేట్ వరకూ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పంపాదిపేట వీధుల్లో సాగిన ఈ యాత్ర శృంగవృక్షంపేట, వాకదారిపేట, గోర్సపాలెం, గడ్డిపేట చేరుకుంది. అక్కడి నుంచి బీచ్‌రోడ్డు మీదుగా బుచ్చియ్యపేట, ఆవులమంద, పెరుమాళ్లపురం, తలపంటిపేట, హుకుంపేట, పాతచోడిపల్లి గ్రామాల మీదుగా సాగింది. ’ప్రాణాలు తీసే దివీస్ మాకొద్దు బాబోయ్’, ప్రభుత్వం దివీస్‌ను రద్దు చేయాలని, అక్రమ కేసులు ఎత్తి వేయాలని, 144 సెక్ష¯ŒS రద్దు చేయాలని, రైతుల భూములను ఇచ్చేదిలేదంటూ నినాదాలు చేశారు. అనంతరం ఉప్పాడ కొత్తపల్లి మండలం మీదుగా పాదయాత్రను కొనసాగించారు. సీఐటీయూ జిల్లా నాయకుడు వేణుగోపాల్, సీపీఎం నాయకులు అప్పారెడ్డి, సింహాచలం, కొత్తపాకలు, తాటియాకులపాలెం, పందిపేటల, శృంగవృక్షంపేట తదితర గ్రామాల ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు.