జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖలో ఇప్పటికే విభజన ప్రక్రిక పూరై ్తనట్లు సమాచారం. కరీంనగర్ కేంద్రంగా జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే.
అగ్నిమాపకశాఖ విభజన పూర్తి
Sep 23 2016 10:34 PM | Updated on Oct 17 2018 3:38 PM
కరీంనగర్ క్రై ం: జిల్లాల పునర్విభజన నేపథ్యంలో అగ్నిమాపక శాఖలో ఇప్పటికే విభజన ప్రక్రిక పూరై ్తనట్లు సమాచారం. కరీంనగర్ కేంద్రంగా జిల్లా అగ్నిమాపక అధికారి ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిమాపక కేంద్రాలు పనిచేస్తున్న విషయం తెలిసిందే. విభజన జరుగుతున్న క్రమంలో అగ్నిమాపక శాఖలో మార్పులు లేకుండా ఆయా జిల్లాల్లోని ఫైర్‌స్టేషన్లు, అక్కడి సిబ్బంది అదేవిధంగా కొనసాగుతారని తెలిసింది. డీఎఫ్‌వో పోస్టులను అప్‌గ్రేడ్ చేసి ప్రాంతీయ అగ్నిమాపక అధికారిగా మార్చి ఒకే అధికారికి మూడు జిల్లాల బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులకు నివేదికలు కూడా పంపారని, రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయని తెలిసింది.
జిల్లాలోని ఫైర్ స్టేషన్లు:
జగిత్యాల : జగిత్యాల, మెట్‌పల్లి (ధర్మపురి, రాయికల్ ఔట్‌సోర్సింగ్)
పెద్దపల్లి : పెద్దపల్లి, మంథని, గోదావరిఖని
కరీంనగర్ : కరీంనగర్, సిరిసిల్ల.
Advertisement


