తెలంగాణ సిబ్బందికి "బ్రోంజ్ డిస్క్" పురస్కారం | Prestigious National Recognition for Telangana Fire Services | Sakshi
Sakshi News home page

తెలంగాణ సిబ్బందికి "బ్రోంజ్ డిస్క్" పురస్కారం

Apr 16 2026 3:13 PM | Updated on Apr 16 2026 3:38 PM

   Prestigious National Recognition for Telangana Fire Services

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ ఫైర్‌, డిజాస్టర్‌ రెస్పాన్స్‌, ఎమర్జెన్సీ అండ్‌ సివిల్‌ డిఫెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ సిబ్బందికి “బ్రోంజ్ డిస్క్, ప్రశంసాపత్రం” పురస్కారం దక్కింది. డైరెక్టరేట్‌ జనరల్‌ ఫైర్‌ సర్వీసెస్‌, సివిల్‌ డిఫెన్స్‌ అండ్‌ గార్డ్స్‌​, హోం శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించాయి.

ఈ పురస్కారాన్ని దేశవ్యాప్తంగా ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్, హోం గార్డ్స్, ఇతర భద్రతా సంస్థల సిబ్బందికి అత్యుత్తమ విధి నిర్వహణ, ధైర్యసాహసం, విశిష్ట సేవలకుగాను ప్రదానం చేస్తారు. దీన్ని ప్రతిష్టాత్మకమైన పురస్కారంగా పరిగణిస్తారు.

తెలంగాణ ఫైర్ సర్వీసెస్ నుంచి ఇంత పెద్ద సంఖ్యలో సిబ్బంది ఈ గౌరవాన్ని పొందడం ఇదే మొదటిసారి. రాష్ట్ర ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్, ఎమర్జెన్సీ, సివిల్ డిఫెన్స్ విభాగ డైరెక్టర్ జనరల్ విక్రం సింగ్‌ మాన్‌ పురస్కార గ్రహీతలను అభినందించారు.

పురస్కార గ్రహీతల జాబితా

  • బి. సుధాకర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్, గౌలిగూడ, హైదరాబాద్

  • జి. యాదగిరి లీడింగ్ ఫైర్ ఫైటర్, సెక్రటేరియట్, హైదరాబాద్

  • ఎం.డి. ఘౌస్ పాషా  లీడింగ్ ఫైర్ ఫైటర్, గద్వాల్

  • గడ్డే కృష్ణ ప్రసాద్ లీడింగ్ ఫైర్ ఫైటర్, వైరా, ఖమ్మం

  • సారా రాజేశ్వర్ ఫైర్ ఫైటర్ టెక్నికల్, హయత్‌నగర్, రంగారెడ్డి

  • వగడాని రామ్ బాబు  ఫైర్ ఫైటర్ టెక్నికల్, ఖమ్మం 

  • కె. వినోద్ కుమార్ ఫైర్ ఫైటర్ టెక్నికల్, స్నార్కెల్,    హైదరాబాద్

  • ఎం. ప్రవితన్  ఫైర్ ఫైటర్  గౌలిగూడ, హైదరాబాద్

  • జి. రాకేష్ కుమార్ ఫైర్ ఫైటర్ హైకోర్టు, హైదరాబాద్

  • జుట్టుకొండ వెంకటేశ్వర్లు, ఫైర్ ఫైటర్, హుజూర్‌నగర్ ,నల్గొండ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement