కరాటేలో జిల్లాకు పతకాల పంట


భోగాపురం (పెదవేగి రూరల్‌) :

రాష్ట్రస్థాయి కరాటే సుమన్‌ కప్‌ –2016 చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు పతకాల పంట పండించారు. గత నెల 28న విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ పోటీలు నిర్వహించగా అన్ని విభాగాల్లోనూ జిల్లా విద్యార్థులు ప్రతిభ చూపారు. స్థానిక విజ్ఞాన్‌ గ్లోబల్‌ జెన్‌ విద్యార్థులు ఏడు పతకాలు సాధించినట్టు ప్రిన్సిపాల్‌ బీఎస్‌ఎన్‌ మణి బుధవారం విలేకరులకు తెలిపారు. తమ పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు జి.వాసుదేవ్, జి.అఖిల్‌ రాఘవ, కేఎ¯Œæవీవీ హనుమ, ఎ.చాణక్య వివిధ విభాగాలలో 3 బంగారు, 2 రజత, 2 కాంస్య పతకాలు మొత్తం 7 పతకాలు సాధించినట్టు చెప్పారు. ఈ పోటీలలో 10 జిల్లాల నుంచి 500 మంది విద్యార్థులు పాల్గొనగా పశ్చిమగోదావరి నుంచి 80 మంది విద్యార్థులు హాజరైనట్టు చెప్పారు. విద్యార్థులను, శిక్షకులు ఇబ్రహిమ్‌ బేగ్, లక్ష్మణరావులను విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, ప్రిన్సిపాల్‌ బీఎస్‌ఎన్‌ మణి, మేనేజర్‌ బి.అప్పారావు, ఉపాధ్యాయులు అభినందించారు. 

భాష్యం విద్యార్థుల ప్రతిభ

కొవ్వూరు : కొవ్వూరు భాష్యం పాఠశాల విద్యార్థులు కరాటే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఎం.రసూల్‌ఖాన్‌ తొమ్మిదేళ్ల విభాగంలో బంగారు పతకం, 14 ఏళ్ల విభాగం కటాలో ఎన్‌ఎల్‌ హేమంత్‌ వెండి పతకం సాధించినట్టు ప్రిన్సిపాల్‌ జె.సూర్యనారాయణ చెప్పారు. విద్యార్థులను ఆయనతో పాటు జోనల్‌ ఇన్‌చార్జ్‌ జీఎన్‌ సత్యనారాయణ, లిటిల్‌ చాంప్స్‌ ప్రిన్సిపాల్‌ కె.మల్లేశ్వరి, కరాటే ఇన్‌స్ట్రక్టర్‌ మీసాల రాధ తదితరులు అభినందించారు. 

సత్తాచాటిన ‘ఐడియల్‌’ విద్యార్థులు

జిన్నూరు (పోడూరు) : రాష్ట్రస్థాయి కరాటే చాంపియన్‌ షిప్‌ పోటీల్లో జిన్నూరు ఐడియల్‌ స్కూల్‌కు చెందిన పలువురు విద్యార్థులు పతకాలు సాధించారు. అండర్‌–12 బాలికల కటా విభాగంలో ఎన్‌.వైష్ణవి బంగారు, కాంస్య పతకాలు, ఎం.రాజవంశీ 2 వెండి పతకాలు, పి.పవన్‌కార్తీక్, కేఎస్‌ఎస్‌ పవన్, వారణాశి వెంకట సూర్య చంద్రమౌళి కాంస్య పతకాలు, డి.దుర్గారామ్‌చరణ్‌ ప్రశంసాపత్రాన్ని సాధించినట్టు స్కూల్‌ కరస్పాండెంట్‌ ఏవీ సుబ్బారావు చెప్పారు. కరాటే శిక్షకులు ధనాని సూర్యప్రకాష్, సీహెచ్‌.లక్ష్మీనారాయణ, ఎన్‌.అప్పలస్వామితో పాటు విద్యార్థులను పలువురు అభినందించారు. 

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top