జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా దంతూరి

జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా దంతూరి

బోట్‌క్లబ్‌ (కాకినాడ) :

జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడిగా దంతూరి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక విద్యుత్‌నగర్‌ చల్లా ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఎన్నికలు నిర్వహించారు. జిల్లాలో వివిధ బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొని సంఘ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ కార్యదర్శిగా మంత్రిప్రగడ వేణుగోపాల్, కోశాధికారిగా గాడేపల్లి సత్యనారాయణ ఎన్నికయ్యారు. దంతూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలోని ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ ఒకటై ఏకగ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ప్రతీ సభ్యునికి అందేలా కృషి చేస్తానన్నారు. అందరి సమ్మతితో మిగిలిన కార్యవర్గాన్ని త్వరలో ప్రకటిస్తామన్నారు. పట్టణ పురోహిత సంఘ అధ్యక్షుడు అకెళ్ల మురళీకృష్ణ, సభ్యులు  దువ్వూరి కామేశ్వర్రావు, వాడ్రేపు దశరధకుమార్, పాలూరి శ్రీనివాస్, కాదంబరి రామ్‌మోహన్, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.  
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top