ప్రాథమిక దశలో చతుర్విధ ప్రక్రియల్లో విద్యార్థి పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు విద్యాశాఖ విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు శుక్ర, శనివారాల్లో అభ్యసన సామరŠాథ్యల పరీక్ష నిర్వహించనుంది.
-
అభ్యసన సామర్థ్యాల మదింపునకు జిల్లా విద్యాశాఖ యత్నం
-
2 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు
-
చతుర్విధ ప్రక్రియలపై దృష్టి సారింపు
-
విద్యార్థులకు నేడు శ్లాస్, రేపు త్రీ ఆర్ పరీక్షలు
రాయవరం :
ప్రాథమిక దశలో చతుర్విధ ప్రక్రియల్లో విద్యార్థి పూర్తి స్థాయిలో పట్టు సాధిస్తున్నారా? లేదా? అని తెలుసుకునేందుకు విద్యాశాఖ విన్నూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈమేరకు శుక్ర, శనివారాల్లో అభ్యసన సామరŠాథ్యల పరీక్ష నిర్వహించనుంది.
బేస్‌లై¯ŒS పరీక్షల్లోను..
విద్యాశాఖ ప్రారంభంలో బేస్‌లై¯ŒS పరీక్షలు నిర్వహిస్తోంది. వీటి ప్రకారం గత తరగతిలో సాధించాల్సిన ప్రమాణాలపై ప్రస్తుతం చదువుతున్న తరగతిలో పరీక్ష నిర్వహిస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభంలో జులైలో బేస్‌లై¯ŒS పరీక్ష నిర్వహిస్తున్నారు. బేస్‌లై¯ŒS పరీక్షలో విద్యాప్రమాణాలు అనుకున్న మేర లేకపోవడంతో ఇప్పుడు రెండు నుంచి ఐదు తరగతుల వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫార్మేటివ్ 3 పరీక్షకు బదులుగా త్రీ ఆర్ పరీక్షను నిర్వహించనున్నారు.
త్రీఆర్ లక్ష్యమేమిటంటే..
త్రీ ఆర్ అంటే రీడింగ్, రైటింగ్, అర్ధమేటిక్‌గా పేర్కొంటున్నారు. నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించేందుకు విద్యాశాఖ త్రీ ఆర్ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రతి విద్యార్థి స్థాయిని బాహ్య మూల్యాంకనం ద్వారా అంచనా వేసి పిల్లల స్థాయిని ఖచ్చితంగా గుర్తించడం దీని ఉద్దేశం. త్రీ ఆర్ బేస్‌లై¯ŒS పరీక్షను ఈ నెల 17 శనివారం జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 3,171 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 2.5లక్షల మంది విద్యార్థులకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
శ్లాస్ అంటే..
స్టూడెంట్ లెర్నింగ్ ఎచీవ్‌మెంట్ సర్వే(శ్లాస్)ను ఈ నెల 16న జిల్లాలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 4,5 తరగతులకు నిర్వహిస్తారు. తెలుగు, గణితం సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. జిల్లా ప్రభుత్వ విద్యా శిక్షణా సంస్థ(డైట్)లో ఛాత్రోపాధ్యాయులుగా ఉన్న జిల్లాలో ఎంపిక చేసిన 40 ప్రభుత్వ, 40 ప్రైవేటు పాఠశాలల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. మిగిలిన పాఠశాలల్లో జంబ్లింగ్ విధానంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులే పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలను రాష్ట్ర పరిశోధనా మండలికి పంపిస్తారు. విద్యార్థుల్లో అభ్యసనా సామర్థాలు కొరవడడానికి గల కారణాలను అన్వేషిస్తారు. తదనంతరం ప్రాథమిక విద్య బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై శోధన చేస్తారు.
తిరోగమనమే కారణమా..
ప్రతి విద్యార్థి ఆయా తరగతిలో సాధించాల్సిన విద్యా ప్రమాణాలు సాధించలేకపోవడంతో ప్రాథమిక విద్య తిరోగమనంలో పయనిస్తున్నందన్న విమర్శలు ఉన్నాయి. దీనికి కారణం ఉన్నత పాఠశాల విద్యార్థి తెలుగు పుస్తకం ధారాళంగా చదవలేకపోవడం, గణితంలో చతుర్విధ ప్రక్రియలు సాధించలేక పోవడం. ప్రాథమిక స్థాయి పూర్తయ్యే సరికి విద్యార్థికి తెలుగు చదవడం, రాయడం, గణితంలో కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు పూర్తి అవగాహనతో చేయాల్సి ఉంది. అయితే ఏడాది క్రితం ఒక స్వచ్ఛంధ సంస్థ నిర్వహించిన సర్వేలో విద్యార్థులు తరగతుల స్థాయికి తగ్గట్టుగా బోధనాభ్యసన స్థాయి సాధించలేక పోయినట్లు గుర్తించారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం..
శ్లాస్, త్రీఆర్ పరీక్షలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించి విద్యార్థుల అసలైన సామరŠాథ్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఉపాధ్యాయులు అంకితభావంతో ఈ పరీక్షలు నిర్వహించాలి.
– ఆర్.నరసింహారావు, డీఈవో, కాకినాడ
మెటీరియల్ పంపిణీకి చర్యలు..
నూరు శాతం ఉపాధ్యాయులు హాజరై పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థులు పరీక్షలకు నూరుశాతం హాజరయ్యే విధంగా చర్యలు తీసకోవాలి. పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను ఎంఈవోల ద్వారా పాఠశాలలకు పంపిస్తున్నాం.
– ఎం.శేషగిరి, పీవో, సర్వశిక్షాఅభియాన్,