
ఆలయంలో భక్తుల సందడి
పర్యాటక కేంద్రం లేపాక్షి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువైంది.
లేపాక్షి : పర్యాటక కేంద్రం లేపాక్షి దేవాలయంలో ఆదివారం భక్తుల సందడి ఎక్కువైంది. శ్రావణ మాసం కావడంతో అనేక మంది భక్తులు ఆలయాన్ని సందర్శించి ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని గైడ్లు ఆలయ విశిష్టతను గురించి తెలియజేయడంలో నిమగ్నం కావడం విశేషం.