చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తగ్గింది.
తిరుమల: చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయానికి భక్తుల రద్దీ తగ్గింది. మొత్తం రెండు కంపార్టుమెంట్లలో స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి మూడు గంటలు తీసుకుంటుండగా, కాలినడక భక్తులకు రెండు గంటల సమయం మాత్రమే పడుతోంది. కాగా, ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా రెండు గంటల్లోనే పూర్తవుతున్నట్లు సమాచారం అందింది.