భూపాలపల్లి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించిన మహాదేవపూర్, మహాముత్తారం, మలా్హర్, కాటారం మండలాలను కలిపి కాటారం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు శనివారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు.
కాటారంను రెవెన్యూ డివిజన్ చేయాలి
Sep 4 2016 12:29 AM | Updated on Sep 4 2017 12:09 PM
హన్మకొండ అర్బన్ : భూపాలపల్లి జిల్లాలో కలిపేందుకు ప్రతిపాదించిన మహాదేవపూర్, మహాముత్తారం, మలా్హర్, కాటారం మండలాలను కలిపి కాటారం రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు శనివారం వరంగల్ కలెక్టర్ కార్యాలయంలో డీఆర్వో శోభకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ, తాడిచర్ల జెన్‌కో భూసేకరణ పూర్తి చేయా ల్సి ఉన్నందున భవిష్యత్ అవసరాలు, అభివృద్ధి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా కాటారం రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని కోరారు. గుండాల శ్రీనివాస్, అందె భాస్కరాచారి, అయితనేని నవీన్‌రావు, సోమ శాంతకుమార్ సమ్మయ్య, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement