కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి | demand for identity cards of labours | Sakshi
Sakshi News home page

కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి

Aug 5 2016 12:44 AM | Updated on Sep 4 2017 7:50 AM

ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం డిమాండ్‌ చేశారు. కార్మికులకు గుర్తింపు కార్డులివ్వాలి

రామగిరి : ఇళ్లలో పనిచేస్తున్న కార్మికులకు వెంటనే గుర్తింపు కార్డులు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ.సలీం డిమాండ్‌ చేశారు. గురువారం సీఐటీయూ డివిజన్‌ కమిటీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ తీర్మానం మేరకు ఇంటి పనివారిని కార్మికులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్‌ ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సాగర్ల యాదయ్య, బోడ ఇస్తారి, గణేశ్, దండంపల్లి సరోజ, జానకి, డేగల రాములమ్మ, అంజమ్మ, పద్మ, వల్లమ్మ, ఏశమ్మ, ఎల్లమ్మ, జ్యోతి, వెంకటమ్మ                 తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement