పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ధర్నా | demand for age limit hike | Sakshi
Sakshi News home page

పోలీసు ఉద్యోగాల వయోపరిమితి పెంచాలని ధర్నా

Aug 9 2016 1:31 AM | Updated on Sep 17 2018 6:18 PM

ఏలూరు(సెంట్రల్‌) : పోలీసు శాఖలో ఉద్యోగాలకు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తు సోమవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు.

ఏలూరు(సెంట్రల్‌) : పోలీసు శాఖలో ఉద్యోగాలకు వయోపరిమితిని ఐదేళ్లకు పెంచాలని డిమాండ్‌ చేస్తు సోమవారం  డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా స్థానిక జిల్లా గ్రంథాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా  డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్‌ జి.శివకుమార్‌ మాట్లాడుతూ  2011 తరువాత తిరిగి ఈ ఏడాదిలోనే 4,548 పోస్టులకు  ప్రభుత్వం నోటిపికేషన్‌ జారీ చేసిందని, దీంతో ఇంతకాలం ఉద్యోగంపై ఆశతో కోచింగ్‌ తీసుకున్న వేలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోనే అవకాశం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నోటిపికే షన్‌ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లు జాప్యం చేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందని శివకుమార్‌ విమర్శించారు. తక్షణమే ఐదేళ్ల వయోపరిమితిని పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం కలెక్టర్‌ కె.భాస్కర్‌ను కలిసి వినితపత్రాన్ని ఇచ్చారు.  ధర్నాలో డీవైఎఫ్‌ఐ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement