డిక్లరేషన్‌ అందుకున్న దీపక్‌ | deepak reddy take to declerations form | Sakshi
Sakshi News home page

డిక్లరేషన్‌ అందుకున్న దీపక్‌

Mar 4 2017 10:23 PM | Updated on Aug 10 2018 7:13 PM

స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుణపాటి దీపక్‌రెడ్డి శనివారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్‌ పత్రాన్ని అందుకున్నారు.

అనంతపురం అర్బన్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన గుణపాటి దీపక్‌రెడ్డి శనివారం  ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జాయింట్‌ కలెక్టర్‌ బి.లక్ష్మీకాంతం నుంచి డిక్లరేషన్‌ పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన ప్రజాప్రతినిధులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్‌ యామినీబాల, ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, గోనుగుంట్ల సూర్యనారాయణ, ఎమ్మెల్సీ కేశవ్ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement