జూరాలలో తగ్గిన ఇన్‌ఫ్లో | decreased jurala inflow | Sakshi
Sakshi News home page

జూరాలలో తగ్గిన ఇన్‌ఫ్లో

Aug 19 2016 12:41 AM | Updated on Sep 4 2017 9:50 AM

జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వరద కేవలం 18వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు పంపుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కుల వరదను పుష్కరఘాట్ల అవసరాల కొరకు విడుదల చేస్తున్నారు.

కొనసాగుతున్న విద్యుదుత్పత్తి
జూరాల : కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో వరద కేవలం 18వేల క్యూసెక్కులు వస్తుండటంతో జలవిద్యుత్‌ కేంద్రంలో రెండు పంపుల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువ నదిలోకి 16వేల క్యూసెక్కుల వరదను పుష్కరఘాట్ల అవసరాల కొరకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయి నీటినిల్వ 9.65 టీంఎసీలు కాగా ప్రస్తుతం 9.09 టీఎంసీల నీటినిల్వ ఉంది. ఇక్కడి నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకాలకు పంపింగ్‌ కొనసాగిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 129.72 టీఎంసీలు కాగా ప్రస్తుతం 123 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టుకు పై నుంచి ఇన్‌ఫ్లో 20,420 క్యూసెక్కుల వరద వస్తుంది. దీంతో ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ద్వారా 15వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి ప్రాజెక్టుకు దిగువన కర్ణాటకలోనే ఉన్న నారాయణపూర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 37.64 టీఎంసీలు కాగా 32.23 టీఎంసీల నీటినిల్వను కొనసాగిస్తున్నారు. పై నుంచి ఇన్‌ఫ్లో 16,321 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టులో క్రస్టుగేట్లన్నీ మూసివేసి నీటినిల్వను పెంచుతున్నారు. కేవలం విద్యుదుత్పత్తి ద్వారా దిగువ జూరాల రిజర్వాయర్‌కు 6వేల క్యూసెక్కుల వరదను విడుదల చేస్తున్నారు. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement