కోస్తాంధ్రలో వచ్చే 24 గంటల్లో తీరం వెంబ డి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు.
- బంగ్లాదేశ్ లో తీరం దాటిన ‘రోను’ తుపాను
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగిన ‘రోను’ తుపాను ఎట్టకేలకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద శనివా రం సాయంత్రం 3.30 గంటలకు తీరం దాటింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది.
కోస్తాంధ్రలో వచ్చే 24 గంటల్లో తీరం వెంబ డి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో ఉరుములతో కూడి న వర్షాలు కురుస్తాయని చెప్పారు. పోర్టుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న 2 నంబరు ప్రమా ద హెచ్చరికలను కూడా ఉపసంహరించారు.