breaking news
Bangladesh Coastal
-
తీరం దాటిన రెమాల్.. ఇక భగభగలే!
సాక్షి, విశాఖపట్నం: తీవ్ర తుపానుగా బలపడిన రెమాల్ ఆదివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. అంతకుముందు తీవ్ర తుపాను గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఉత్తర బంగాళాఖాతం నుంచి తీరం వైపు పయనించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు విపత్తు నిర్వహణ కోసం భారీ ఎత్తున ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలకు ఉపక్రమించాయి. తుపాన్ ప్రభావం మన రాష్ట్రంపై అంతగా లేకపోయినా.. దీని కారణంగా రాష్ట్రంలో తేమ మొత్తం పోయింది. పొడి వాతావరణం ఏర్పడింది.దీనికితోడు ఏపీ, యానాంలో పశ్చిమదిశగా గాలులు వీస్తుండటంతో ఉక్కపోత మరింత ఎక్కువ కానుంది. రాబోయే రెండురోజులు కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం ఏర్పడుతుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువగా నమోదవుతాయని భారత వాతావరణశాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమల్లో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.రెండురోజుల తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, మధ్య బంగాళాఖాతం, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించాయి. నైరుతి ఈ నెల 31 నాటికి కేరళలోకి ప్రవేశించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. ఏప్రిల్ నెలలో తీవ్ర వడగాలులకు తోడు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పుడు రెమాల్ తుపాను ముప్పు తప్పినప్పటికీ.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు వచ్చేవరకు(జూన్ 3దాకా) ఇదే పరిస్థితి కొనసాగుతుందని, వడగాలులు తీవ్రరూపం దాల్చుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
కోస్తాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు
- బంగ్లాదేశ్ లో తీరం దాటిన ‘రోను’ తుపాను సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగిన ‘రోను’ తుపాను ఎట్టకేలకు బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ వద్ద శనివా రం సాయంత్రం 3.30 గంటలకు తీరం దాటింది. ఇది తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తూ క్రమేపీ బలహీనపడి ఆదివారం ఉదయానికి వాయుగుండంగా మారనుంది. కోస్తాంధ్రలో వచ్చే 24 గంటల్లో తీరం వెంబ డి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగం తో ఈదురుగాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో ఉరుములతో కూడి న వర్షాలు కురుస్తాయని చెప్పారు. పోర్టుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న 2 నంబరు ప్రమా ద హెచ్చరికలను కూడా ఉపసంహరించారు.