సైకిల్‌పోలో విజేత కృష్ణా | cycle polo winner is krishna | Sakshi
Sakshi News home page

సైకిల్‌పోలో విజేత కృష్ణా

Sep 18 2016 9:17 PM | Updated on Sep 4 2017 2:01 PM

స్వర్ణ పతకాలు సాధించిన  కృష్ణా  జిల్లా జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న దశ్యం

స్వర్ణ పతకాలు సాధించిన కృష్ణా జిల్లా జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న దశ్యం

రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది.

– రన్నర్‌ స్థానంతో సరిపెట్టుకున్న కర్నూలు
 
బనగానపల్లె రూరల్‌: రాష్ట్రస్థాయి సైకిల్‌ పోలో పోటీల్లో కృష్ణా జిల్లా జట్టు విజేతగా నిలిచింది. రన్నర్‌ స్థానంతో కర్నూలు జిల్లా జట్టు సరిపెట్టుకుంది. స్థానిక నెహ్రూ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల క్రీడామైదానంలో ఈ పోటీలు ఆదివారం ముగిశాయి. పోటీల్లో రాష్ట్రంలోని ఏడు జిల్లాల నుంచి వచ్చిన సబ్‌ జూనియర్స్, జూనియర్స్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీల్లో జూనియర్‌ విభాగంలో కృష్ణా జిల్లా జట్టు 2–1 గోల్స్‌తో కర్నూలు జట్టుపై విజయం సాధించి బంగారు పతకం సాధించింది. అలాగే రన్నర్స్‌ స్థానంతో కర్నూలు జట్టు రజత పతకం సాధించినట్లు  క్రీడాల నిర్వాహక కమిటీ చైర్మన్‌ కోడూరు హరినాథ్‌రెడ్డి తెలిపారు.
 
బహుమతుల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర సైకిల్‌ పోలో సంఘం కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ..గెలుపొందిన విజేతలకు ఈ నెల 24వ తేదీ నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో ప్రత్యేక శిక్షణ ఉంటుందన్నారు. వీరు త్వరలో కేరళలో జరిగే జాతీయ స్థాయి సైకిల్‌ పోలో చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారన్నారు. పోటీల నిర్వాహక కమిటీ చైర్మన్‌ కోడూరు హరినాథ్‌ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయిలో గెలుపొందిన క్రీడాకారులు జాతీయ స్థాయిలో కూడ ప్రతిభకనబరచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి రామాంజనేయులు, క్రీడారంగం ఎడిటర్‌ శివ పరమేశ్‌‡, జిల్లా యోగా సంఘం కార్యదర్శి అవినాష్, స్కూల్‌ డైరెక్టర్‌ రవితేజా రెడ్డి,హెచ్‌ఎం కమల్‌తేజా రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ అబ్జర్వర్‌ సురేందర్, ఒలింపిక్‌ సంఘం అబ్జర్వర్‌ విజయకుమార్‌ తదితర క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement