విద్యుదాఘాతంతో వృద్ధురాలి దుర్మరణం | current shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో వృద్ధురాలి దుర్మరణం

Aug 22 2016 11:37 PM | Updated on Sep 4 2017 10:24 AM

ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మిడ్జిల్‌ మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన ఉప్పరి నారమ్మ (65) సోమవారం సాయంత్రం ఇంట్లో టీవీ ఆన్‌చేయగా ప్రమాదవశాత్తు కేబుల్‌ వైరుకు విద్యుత్‌ ప్రసారమైంది.దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురికాగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.

మిడ్జిల్‌ : ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. మిడ్జిల్‌ మండలంలోని బోయిన్‌పల్లికి చెందిన ఉప్పరి నారమ్మ (65) సోమవారం సాయంత్రం  ఇంట్లో టీవీ ఆన్‌చేయగా ప్రమాదవశాత్తు కేబుల్‌ వైరుకు విద్యుత్‌ ప్రసారమైంది.
దీంతో ఆమె విద్యుదాఘాతానికి గురికాగా కుటుంబ సభ్యులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ సంఘటనతో వారు కన్నీరుమున్నీరయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement