సాంస్కృతిక సందడి | Cultural feast at Puskara ghats | Sakshi
Sakshi News home page

సాంస్కృతిక సందడి

Aug 20 2016 10:21 PM | Updated on Aug 20 2018 4:42 PM

సాంస్కృతిక సందడి - Sakshi

సాంస్కృతిక సందడి

తానగరం పుష్కరఘాట్లో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా శనివారం ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.

సీతానగరం (తాడేపల్లి రూరల్‌): సీతానగరం పుష్కరఘాట్లో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా శనివారం ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి చేరుకున్న కళాకారులు కూచిపూడి  నృత్యాలు, భరత నాట్యం, కోలాటం, లఘునాటికలు ప్రదర్శించారు. కృష్ణమ్మ గొప్పదనాన్ని వర్ణిస్తూ కీర్తనలు, గేయాలు, పద్యాల రూపంలో కళాకారులు తమదైన శైలిలో తెలియజేస్తున్నారు. పుష్కర ఘాట్‌లో ప్రదర్శనలను భక్తులు తిలకించారు. కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. జాయింట్‌ కలెక్టర్‌ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి బెజ్జం విజయభాస్కర్, ఎంఈవో రాయల సుబ్బారావు, మునిసిపల్‌ కమిషనర్‌ బిక్కిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement