breaking news
performace
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
సాంస్కృతిక సందడి
సీతానగరం (తాడేపల్లి రూరల్): సీతానగరం పుష్కరఘాట్లో కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తున్నారు. పుష్కరాల్లో భాగంగా శనివారం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల నుంచి చేరుకున్న కళాకారులు కూచిపూడి నృత్యాలు, భరత నాట్యం, కోలాటం, లఘునాటికలు ప్రదర్శించారు. కృష్ణమ్మ గొప్పదనాన్ని వర్ణిస్తూ కీర్తనలు, గేయాలు, పద్యాల రూపంలో కళాకారులు తమదైన శైలిలో తెలియజేస్తున్నారు. పుష్కర ఘాట్లో ప్రదర్శనలను భక్తులు తిలకించారు. కళాకారులు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విశేషంగా ఆకట్టుకున్నారు. జాయింట్ కలెక్టర్ ముంగా వెంకటేశ్వరరావు, జిల్లా ఉప విద్యాశాఖాధికారి బెజ్జం విజయభాస్కర్, ఎంఈవో రాయల సుబ్బారావు, మునిసిపల్ కమిషనర్ బిక్కిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.