బెట్టింగ్ చేతిలో బంతి..! | cricket betting in darshi centre | Sakshi
Sakshi News home page

బెట్టింగ్ చేతిలో బంతి..!

Mar 21 2016 4:16 AM | Updated on Aug 21 2018 8:14 PM

బెట్టింగ్ చేతిలో బంతి..! - Sakshi

బెట్టింగ్ చేతిలో బంతి..!

సందడిలో అభిమానులుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు గుట్టుగా తమ పని చక్కబెట్టుకుంటున్నారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్ క్రికెట్ 
దర్శి కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ అంతా వన్ సైడే..
ఓడితే..డబ్బు ఇవ్వకుండా పోలీసులతో బెదిరింపులు..
గెలిస్తే అధికారం ఉపయోగించి వసూళ్లు
టీ 20లో జోరుగా వ్యాపారం


సందడిలో అభిమానులుంటే.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు గుట్టుగా తమ పని చక్కబెట్టుకుంటున్నారు. కోట్ల రూపాయల బెట్టింగులకు పాల్పడుతూ అభిమానుల్ని దోచుకుంటున్నారు. ఒక్క షాట్ కొడితే ఆరు పరుగులు రావాలి ఒక్క బెట్టింగ్ నిర్వహిస్తే కోట్లు వచ్చిపడాలి  అరుుతే ఎవరు గెలుస్తారో చెప్పలేం అటూ ఇటూ అరుుతే లైఫ్ రిస్క  అందుకే కొత్త తరహా మాఫియూ పుట్టింది.. మధ్యవర్తుల్లా రంగంలోకి దిగుతారు.. ఒక సైడ్ తమవారిని ఉంచుతారు ఓడితే.. డబ్బు ఇవ్వకుండా వేధిస్తారు..  గెలిస్తే బెదిరించి డబ్బు గుంజుకుంటారు ఇదంతా దర్శి క్యాపిటల్‌గా  జరుగుతున్న వ్యవహారం - సాక్షి ప్రతినిధి, ఒంగోలు

క్రికెట్ బెట్టింగ్ బూచీ పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోంది.  రెట్టింపు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.  20-20 ప్రపంచకప్ రాకతో బెట్టింగులు జోరందుకున్నాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో ఈ వ్యవహారం జోరందుకుంది. ప్రధానంగా దర్శి కేంద్రంగా కోట్లాది రూపాయల బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలిసింది.  పాకిస్థాన్- ఇండియా మ్యాచ్ జరిగితే మాత్రం భారీగా డబ్బులు చేతులు మారుతున్నారుు.

 ఎలా?

 బెట్టింగ్ నిర్వహించే మధ్యవర్తి.. పోటీదారులు ఇద్దరినీ ఫోన్ లైన్‌లో ఉంచి బెట్టింగ్‌ను నిర్ణరుుస్తాడు. వాయిస్‌లను రికార్డు చేస్తాడు. తానే మీ ఇద్దరికి హామీ అంటూ వారి మధ్య ఒప్పందం కుదుర్చుతాడు. తన కమీషన్ కూడా ప్రస్తావించి గెలిచిన వారే ఇచ్చేలా మాట్లాడుకుంటారు.

 గెలిచిన వ్యక్తి.. మధ్యవర్తిని డబ్బులు అడగగానే అవతల వ్యక్తి ఇంకా తన చేతికి ఇవ్వలేదని.. ఇచ్చిన వెంటనే అందజేస్తానని హామీ ఇస్తాడు. కానీ డబ్బు ఎప్పటికీ అందదు. ఎందుకంటే అవతలి వ్యక్తి..  మధ్యవర్తి ఏర్పాటు చేసిన వాడే కావడం. గెలుపొందిన వ్యక్తి గట్టిగా నిలదీస్తే పోలీసులను ఆశ్రయిస్తున్నానని బెదిరింపులకు గురి చేస్తాడు. ఆ తరువాత పోలీసు అధికారి పేరుతో ఓ ఫోన్ వస్తుంది. ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఇలా గెలిచిన వ్యక్తి మౌనంగా ఉండిపోతాడు. మధ్యవర్తికి చెందిన వ్యక్తి గెలిస్తే మాత్రం అధికార బలాన్ని ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తారు.

 కోట్లాది రూపాయలు..
నియోజకవర్గంలో ఉన్న ఓ ప్రధాన సూత్రదారుడు  జిల్లాతో పాటు ఇతర జిల్లాలు, తెలంగాణ రాష్ట్రంలో కూడా మధ్యవర్తులను పెట్టి బెట్టింగ్‌లు నడిపిస్తున్నట్లు సమాచారం. ఇతను ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పోలీసులు కేసులు రాకుండా చూసుకుంటున్నాడని తెలిసింది.

Advertisement
 
Advertisement
Advertisement