భార్య కాపురానికి రావడం లలేదని మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుని వాగ్మూలం ఇలా ఉంది. ఎన్‌వి రత్నం అనే రిజర్వ్ కానిస్టేబుల్ స్థానిక రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో భార్యాబిడ్డలతో నివాసం ఉంటున్నాడు.
ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం
Nov 8 2016 5:13 PM | Updated on Jul 27 2018 2:21 PM
ఏలూరు: భార్య కాపురానికి రావడం లలేదని మనస్తాపానికి గురైన ఏఆర్ కానిస్టేబుల్ ఒకరు చెదల మందు తాగి ఆత్మహత్యకు యత్నించి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇందుకు సంబంధించి బాధితుని వాగ్మూలం ఇలా ఉంది. ఎన్‌వి రత్నం అనే రిజర్వ్ కానిస్టేబుల్ స్థానిక రిజర్వ్ పోలీస్ క్వార్టర్స్‌లో భార్యాబిడ్డలతో నివాసం ఉంటున్నాడు. అయితే చాలా కాలంగా భార్యాభర్తలిద్దరూ కుటుంబకలహాలతో ఘర్షణ పడుతున్నారు. దాంతో అతని భార్య భర్తను విడిచిపెట్టి కూతురుతో సహా వేరుగా ఉంటుంది. దాంతో మనస్తాపం చెందిన రత్నం మంగళవారం తన నివాసంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన సహోద్యోగులు ఏలూరు ప్రభుత్వాసుపత్రి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సంఘటనపై సమాచారం అందుకున్న ఏఆర్ ఆర్‌ఐక కె. వెంకటరావు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షడు నాగరాజు ఆసుపత్రికి వైద్యులతో బాధితుని ఆరోగ్య పరిస్థితిపై విచారిం,ఇ బాధితుని పరామర్శించారు.
Advertisement
Advertisement