‘ట్యాగ్ లైన్ల’పై హెచ్చార్సీలో ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

‘ట్యాగ్ లైన్ల’పై హెచ్చార్సీలో ఫిర్యాదు

Published Wed, Jun 8 2016 8:49 AM

complaint in hrc for taglines

నాంపల్లి: ఎలాంటి అనుమతులు లేకుండా ట్యాగ్ లైన్లు వాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న  ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ప్రైవేట్ టీచర్స్, లెక్చరర్స్, స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సోమగాని కిరణ్ కుమార్ మంగళవారం నాంపల్లిలోని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. జి.ఓ నెం. 91 ప్రకారం రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చేపట్టాలని కోరారు.ఫిర్యాదు స్వీకరించిన  కమిషన్ జులై 20లోగా నివేదికను సమర్పించాలని కోరుతూ డెరైక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్‌కు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement