పర్యావరణ పరిరక్షణకు ముందుకు రండి | Come forward to environmental conservation | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణకు ముందుకు రండి

May 28 2017 10:27 PM | Updated on Sep 5 2017 12:13 PM

పర్యావరణ పరిరక్షణకు ముందుకు రండి

పర్యావరణ పరిరక్షణకు ముందుకు రండి

ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఉన్న చెట్లను నరికివేస్తుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఖాజాహుసేన్‌ అన్నారు.

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో ఉన్న చెట్లను నరికివేస్తుండడంతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు ఖాజాహుసేన్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రాకపోతే భవిష్యత్‌ అంధకరంలోకి నెట్టబడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా నగరాల్లో చెట్లను విపరీతంగా నరికి వేస్తుండడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నగరంలోని ఐఎస్‌సీ కోచింగ్‌ హాల్‌లో జరిగిన జేవీవీ కర్నూలు జిల్లా  ప్లీనం సమావేశంలో ఆయన మాట్లాడారు. పర్యావరణ పరిక్షణపై ప్రజలకు జేవీవీ కార్యకర్తలు అవగాహన కల్పించాలని కోరారు. ప్రముఖ వైద్యుడు రాంగోపాల్, జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement