కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం | Collective movement for caste eradication | Sakshi
Sakshi News home page

కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం

Jul 6 2017 10:33 AM | Updated on Mar 28 2018 11:26 AM

కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం - Sakshi

కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమం

కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమాలు చేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ సమన్వయకర్త వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.

సుందరయ్య విజ్ఞానకేంద్రం: కుల నిర్మూలనకు సమష్టి ఉద్యమాలు చేయాలని దళిత్‌ శోషణ్‌ ముక్తి మంచ్‌ జాతీయ సమన్వయకర్త వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి (కేవీపీఎస్‌) రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశం బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక, కుల ఆధిపత్యంతో దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు.

తెలంగాణలో  కులాంతర వివాహం చేసుకు న్న 13 మందిని హత్య చేశారని వాపోయారు. దళితులకు భూమి లేనిదే ఆర్థిక సమానత్వం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికను రాజకీ య పార్టీలు దళితుల మధ్య పోటీగా చిత్రీకరించడం దారుణమన్నారు. కార్యక్రమంలో కేవీపీఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె.భాస్కర్, టి.స్కైలాబ్‌బాబు, నాయకులు జి.నాగయ్య, జాన్‌వెస్లీ, కురుమయ్య, కృపాసాగర్, మాణిక్యం, మనోహర్, కుమార్‌  పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement