హనుమద్‌ వాహనంపై చింతల రాయుడు | chinthal rayudu brahmothsavas in tadipratri | Sakshi
Sakshi News home page

హనుమద్‌ వాహనంపై చింతల రాయుడు

Oct 14 2016 10:59 PM | Updated on Sep 4 2017 5:12 PM

హనుమద్‌ వాహనంపై చింతల రాయుడు

హనుమద్‌ వాహనంపై చింతల రాయుడు

చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రాత్రి హనుమద్‌ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

తాడిపత్రి టౌన్‌ : చింతల వెంకటరమణ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రాత్రి హనుమద్‌ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సహిత చింతల రాయుడిని పుర వీధుల్లో ఊరేగించారు. అలాగే రాత్రికి స్వామి వారి విగ్రహాన్ని హనుమద్‌ వాహనంపై ఉంచి పురవీధుల్లో ఊరేగించారు.

స్థానిక ఆలయం నుంచి గాంధీకట్ట, మెయిన్‌బజారు, పోలీస్‌స్టేషన్‌ సర్కిల్‌తో పాటు సీబీరోడ్డు పురవీధుల గుండా ఊరేగింపు కొనసాగింది. కార్యక్రమంలో చింతల, బుగ్గ ధర్మకర్తల మండలి అధ్యక్షులు దామోదర్‌దాసు, కష్ణారెడ్డి, సభ్యులు భూమా సూర్యనారాయణ, రవిప్రసాదు, పరిసె చంద్రశేఖర్, ఓబిరెడ్డి, వెంకటశేషాపణి, వెంకటేశ్వర్లు, వెంకటరాముడు భక్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement