
టన్ను రూ. 15వేలు!
చీనీకాయల ధర మరింత క్షీణించింది.
చీనీకాయల ధర మరింత క్షీణించింది. ఉత్తరాది రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ ప్రాంతంలో భారీ వర్షాలు పడుతున్నందున ధరలు తగ్గుముఖం పట్టినట్లు సమాచారం. పది రోజుల కిందట టన్ను చీనీ కాయలు రూ.33 వేల వరకు పలికిన ధర ఇప్పుడు ఏకంగా రూ. పది వేలకు దిగజారింది. మంగళవారం అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డుకు 235 టన్నుల చీనీకాయలు రాగా టన్ను గరిష్టంగా రూ. 21 వేలు పలికింది. కనిష్టం రూ.10 వేలు కాగా సరాసరి రూ.15 వేలకు పరిమితమైంది.
- అనంతపురం అగ్రికల్చర్