విష జ్వరంతో చిన్నారి మృతి | Child Died For Viral Feaver | Sakshi
Sakshi News home page

విష జ్వరంతో చిన్నారి మృతి

Sep 3 2016 11:19 PM | Updated on Sep 4 2017 12:09 PM

విష జ్వరంతో చిన్నారి మృతి

విష జ్వరంతో చిన్నారి మృతి

స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది.

చెన్నూరు: స్థానిక సరస్వతీనగర్‌లో నివాసముంటున్న కె రవి, మహేశ్వరిల కుమార్తె తేజస్విని(2) విషజ్వరంతో శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. బంధువులు తెలిపిన ప్రకారం తేజస్వినికి మూడు రోజులుగా జ్వరం వస్తుండటంతో స్థానిక ప్రభుత్వ  వైద్యశాల, ఆర్‌ఎంపీ వైద్యుని వద్ద చికిత్స చేయించారు. శుక్రవారం వైద్యశాలలో చికిత్స అనంతరం ఇంటికి తీసుకురాగా రాత్రి తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడానికి కష్టంగా ఉండటంతో స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుని వద్దకు తీసుకెళ్లగా, కడపకు తీసుకెళ్లాలని సూచించారు. రిమ్స్‌కు తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందింది.  
విజృంభిస్తున్న విష జ్వరాలు : చెన్నూరు మండలంలోని చిన్నమాచుపల్లె, శివాలపల్లె, చెన్నూరు, బయనపల్లె గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. చెన్నూరు తూర్పు దళితవాడకు చెందిన బాలిక డెంగీ లక్షణాలతో చికిత్స పొందుతోంది. వనంవీధికి చెందిన సురేష్‌ కుమార్తె అలేఖ్య (7) విషజ్వరంతో బాధపడుతుండగా కడపకు తీసుకెళ్లగా డెంగీ జ్వరమని అక్కడి వైద్యులు నిర్ధారించడంతో కర్నూలుకు తరలించారు. మండలంలో పలు గ్రామాల్లో జ్వరాలతో బాధపడుతున్నారని అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement