మానవత్వం మరచి.. | child baby in dustbin at near ramnagar | Sakshi
Sakshi News home page

మానవత్వం మరచి..

May 25 2017 11:15 PM | Updated on Sep 5 2017 11:59 AM

మానవత్వం మరచి..

మానవత్వం మరచి..

మానవత్వం మరచి నాలుగు రోజుల కిందట జన్మించిన ఆడశిశువు అనారోగ్యంతో మృతి చెందితే కనీసం ఖననం కూడా చేయకుండానే ఓ అట్టపెట్టెలో మృతదేహాన్ని పెట్టి మురుగునీటి కాలువ పక్కన వదిలేసి వెళ్లిన ఉదంతమిది.

– అట్టపెట్టలో మృతశిశువును వదిలేసి వెళ్లిన తల్లిదండ్రులు
– పోలీసుల సహకారంతో అంత్యక్రియలు

అనంతపురం సెంట్రల్‌ : మానవత్వం మరచి నాలుగు రోజుల కిందట జన్మించిన ఆడశిశువు అనారోగ్యంతో మృతి చెందితే కనీసం ఖననం కూడా చేయకుండానే ఓ అట్టపెట్టెలో మృతదేహాన్ని పెట్టి మురుగునీటి కాలువ పక్కన వదిలేసి వెళ్లిన ఉదంతమిది. అనంతపురం రామ్‌నగర్‌ రైల్వే వంతెన సమీపంలో గురువారం ఉదయం జరిగిన ఘటనకు సంబంధించి నాల్గో పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్‌ కథనం మేరకు.. ఉరవకొండ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు నాలుగు రోజుల కిందట అనంతపురం పెద్దాస్పత్రిలో చేరారు. కుమార్తె పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స తీసుకున్నారు.

అయితే పరిస్థితి విషమించి పసికందు మృతి చెందింది. పేదరికంతో ఆ తల్లిదండ్రులు మృతశిశువును ఖననం చేయకుండానే అట్టపెట్టెలో పెట్టి వదిలేసి వెళ్లిపోయారు. మృతశిశువును స్వాదీనం చేసుకుని సంజీవని రక్తదాతల సంస్థ నిర్వాహకుడు రమణారెడ్డి సహకారంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటనకు కారణమైన దంపతులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించిన ఎస్‌ఐ వారిని తీవ్రంగా మందలించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరిగితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement